ఆళ్లగడ్డ పట్టణంలో ఓవర్ రోడ్డు ఆటోలపై, నంద్యాల MVI రవి శంకర్ నాయక్ కొరడా
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ లో ఓవర్ లోడ్ తో ప్రయాణికులను ఎక్కిస్తున్న ఆటో డ్రైవర్ల పై ఆదివారము నంద్యాల MVI రవి శంకర్ నాయక్ హెచ్చరికలు జారీ చేశారు, ఆదివారం ఆళ్లగడ్డలో నిర్వహించిన ఆటో తనిఖీలలో ప్రయాణికుల సంఖ్యలను పరిశీలించి ఆటో డ్రైవర్లకు కౌన్సిలింగ్ ఇచ్చారు, ఆటోలలో ఆరుగురికి మించి ఎక్కిస్తే లైసెన్స్ రద్దు చేస్తామని హెచ్చరించారు, ఆటో డ్రైవర్లు తప్పనిసరిగా రోడ్డు భద్రతా నియమాలు పాటించాలన్నారు