నారాయణపేట్: పత్తికి మద్దతు ధర 10075 రూపాయలు ఇవ్వాలి: అఖిలభారత ఐక్య రైతు సంఘం డిమాండ్
కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం పత్తికి మద్దతు ధర రూ.10075 నిర్ణయించి అమలు చేయాలని అఖిలభారత ఐక్య రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.రాము డిమాండ్ చేశారు. నారాయణపేట మండల పరిధిలోని లింగంపల్లి గ్రామం దగ్గర ఉన్న భాగ్యలక్ష్మి పత్తి మిల్లును బుధవారం ఒంటిగంట సమయంలో సందర్శించారు. అధిక వర్షాల వల్ల పత్తి దిగుబడి సగానికి పడిపోవడం అకాల వర్షాల వల్ల తేమ శాతం ఎక్కువ ఉండటం వలన కేంద్ర ప్రభుత్వం పత్తి దిగుమతి పై 11% సుంఖాన్ని రద్దు చేయడం మూలంగా మార్కెట్లో పత్తి డిమాండ్ తగ్గిపోవడం జరిగిందని అన్నారు.