ఆత్మకూరు: భారీ వర్షాల కారణంగా ప్రమాదకరంగా ప్రవహిస్తున్న కలుజు, మూడు గ్రామాలకు రాకపోకలు నిలిపివేత
నెల్లూరు జిల్లా, ఆత్మకూరు నియోజకవర్గం, సంగం మండలం, వంగల్లు గ్రామంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కలుజు వద్ద వరద ప్రవాహం ప్రమాదకరంగా పెరిగింది. దీంతో అధికారులు తక్షణమే రాకపోకలను నిలిపివేశారు. వంగల్లు, జంగాల కండ్రిక, మర్రిపాడు గ్రామాలకు రాకపోకలు పూర్తిగా ఆగిపోయాయి. ఎవరూ కలుజు దాటకుండా ముళ్లకంప వేసి, సిబ్బందిని ఏర్పాటు చేసి అధికారులు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. తుఫాను తీరం దాటే సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.