అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణంలోని శ్రీ షిరిడి సాయి బాబా స్వామి వారి ఊరేగింపు కార్యక్రమాన్ని సోమవారం రాత్రి భక్తులు ఘనంగా నిర్వహించారు. పర్వదినం సందర్బంగా నిర్వహించిన గ్రామోత్సవంలో రాష్ట్ర ఆర్థిక & ప్రణాళిక, వాణిజ్య పన్నులు మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రివర్యులు శ్రీ పయ్యావుల కేశవ్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామి వారిని దర్శించుకున్నారు. గ్రామోత్సవ కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.