వైసీపీ కార్యకర్తలను వేధించే ఏ ఒక్క అధికారులు వదిలిపెట్టం అనంతపురంలో రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి
అనంతపురం జిల్లా కేంద్రంలో రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి వైసీపీ నేతలతో కలిసి మంగళవారం మధ్యాహ్నం ఒంటిగంట 45 నిమిషాల సమయంలో డిజిటల్ బుక్ శ్రీరామరక్ష వాల్ పోస్టులను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాప్తాడు మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ రాప్తాడు నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తన పైన వైసిపి పార్టీ నేతలపైన సానుభూతిపరుల పైన కొంతమంది పోలీసులు కక్షగట్టి అక్రమ కేసులు నమోదు చేస్తున్నారని ఇటువంటి అధికారులందరినీ డిజిటల్ బుక్ లో నమోదు చేయించి వైసిపి ప్రభుత్వం వచ్చిన తర్వాత న్యాయం చేస్తామని మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి పేర్కొన్నారు.