చెన్నూరు: పలు వార్డుల్లో పర్యటించి ప్రజలను స్థానిక సమస్యల పై అడిగి తెలుసుకున్న మంత్రి వివేక్ వెంకటస్వామి
చెన్నూర్ పట్టణంలోని పలు వార్డుల్లో మంగళవారం ఉదయం మంత్రి వివేక్ వెంకటస్వామి పర్యటించారు.స్థానిక ప్రజలను కలుసుకొని సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తక్షణమే ప్రజలు తెలిపిన సమస్యలను పరిష్కరిస్తానని వారికి హామీ ఇచ్చారు. ఇటీవల మృతి చెందిన వ్యక్తుల కుటుంబాలను ప్రజలతో కలిసి వారికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాధిత కుటుంబాలకు అవసరమైన సాయం అందిస్తామన్నారు.