నాగలాపురంలోని బస్ షెల్టర్‌లో మద్యం బాటిళ్లు, చెత్తాచెదారం తొలగించి వినియోగంలోకి తెచ్చిన పంచాయతీ కార్యదర్శి
నాగలాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ఎదురుగా బస్ షెల్టర్ ఉంది. 'బస్సు షెల్టర్ లేక అల్లాడుతున్న గర్భవతులు, బాలింతలు' అని పబ్లిక్ యాప్ లో సోమవారం వార్త ప్రచురితమైంది. ఈ వార్తపై పంచాయతీ కార్యదర్శి రమేశ్ మంగళవారం స్పందించారు. పంచాయతీ పారిశుద్ధ్య సిబ్బందితోపాటు బస్ షెల్టర్ వద్దకు వెళ్లి బైకులను తొలగించి మద్యం బాటిళ్లు, చెత్తాచెదారం తొలగించి వినియోగంలోకి తెచ్చారు. ఈ చర్యపై ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.