కరీంనగర్: సాంప్రదాయ కట్టు బొట్టు పాటిస్తూ ఎంగిలి పువ్వుల బతుకమ్మ వేడుకలను మహిళలు ఘనంగా నిర్వహించారు.
సాంప్రదాయాలను పాటిస్తూ బతుకమ్మ వేడుకలను కరీంనగర్ జ్యోతి నగర్ కురుమ వాడలో మహిళలు ఆదివారం ఎంగిలి పువ్వుల బతుకమ్మను ఘనంగా నిర్వహించనున్నారు. ఈ మధ్యకాలంలో బతుకమ్మ పండుగను డీజే పాటలతో, కోలాటం నృత్యాలతో నిర్వహించుకుంటున్నారు. అలాకాకుండా సాంప్రదాయ చీరలు కట్టి, స్వయంగా పాటలు పాడుకుంటూ ఎంగిల పూల బతుకమ్మ బతుకమ్మ పండుగను నిర్వహించుకున్నారు.