సూర్యాపేట: 18 తులాల బంగారు నగదు స్వాధీనం ఎస్పీ నరసింహ
చోరీకి గురైన 18 తులాల బంగారు ఆభరణాలను సూర్యాపేట పోలీసులు రికవరీ చేశారు. ఈ మేరకు ఎస్పీ నరసింహ బుధవారం వివరాలు వెల్లడించారు. 2024 ఆగస్టు 18న విభాలాపురంలో అరుంధతి అనే మహిళ వద్ద నగలు అపహరణకు గురయ్యాయి. నిన్న మమ్మీలా గూడెం వద్ద వాహన తనిఖీల్లో అనుమానాస్పదంగా కనిపించిన నిందితులను విచారించగా, వారు నేరం అంగీకరించారు. ఇద్దరిని రిమాండ్కు తరలించగా, మరొకరు పరారీలో ఉన్నట్లు ఎస్పీ తెలిపారు.