నంద్యాల అర్బన్: 70 ఏళ్ల తర్వాత మహానంది మండలం తమ్మడపల్లె గ్రామంలో పెద్దమ్మ తల్లి దేవర
Nandyal Urban, Nandyal | Jun 4, 2026
70 ఏళ్ల తర్వాత మహానంది నంద్యాల జిల్లా తమ్మడపల్లెలో పెద్దమ్మ తల్లి దేవర వైభవంగా జరిగింది. అమ్మవారి విగ్రహాన్ని పెద్దమ్మ అరుగు వద్ద ఆసీనులు చేశారు. గ్రామోత్సవాన్ని వేలాది మంది భక్తులు కనులారా తిలకించి జై పెద్దమ్మ తల్లి అంటూ నినదించారు. కోలాటం, చెక్కభజనలు ఆకట్టుకున్నాయి. గ్రామమంతా విద్యుత్ కాంతులతో వెలిగిపోయింది. 1956 తర్వాత దేవర జరగడంతో భక్తులు, బంధుమిత్రులతో గ్రామం కిటకిటలాడింది.