డోన్: డోన్ లో డ్రగ్స్ వల్ల కలిగే అనర్ధాలపై ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమం
Dhone, Nandyal | Jun 24, 2026 నంద్యాల జిల్లా డోన్ ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు నషా ముక్త భారత్ అభియాన్ మత్తు మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే నష్టాలపై అవగాహన కల్పించారు. యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండి దేశ, రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషించాలని, ఆంధ్రప్రదేశ్ను మాదక ద్రవ్య రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు సహకరించాలని విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు.ఎక్సైజ్ సీఐ లక్ష్మణ దాసు, ఎస్ఐలు సోమశేఖర్ రావు, దౌలత్ ఖాన్ పాల్గొన్నారు.