నిజామాబాద్ సౌత్: రైతులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారు సహాయ సహకారాలు అందించాలి: నగరంలో NDCCB సమీక్షలో ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి
సహకార బ్యాంకులను దాదాపు 100 సంవత్సరాల కంటే ముందే రైతుల అభివృద్ధి కొరకు స్థాపించడం జరిగిందని బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి తెలిపారు. రైతులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారికి సహాయ సహకారాలు అందించాలని రైతులు క్షేమంగా ఉంటేనే సహకార సంఘాలు అభివృద్ధి చెందుతాయన్నారు. నిజామాబాద్ నగరంలోని జిల్లా సహకార కేంద్ర బ్యాంకులో అధ్యక్షులు రమేష్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సమీక్ష సమావేశంలో మాజీ మంత్రి, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి సంఘ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా సంస్థ యొక్క లావాదేవీలను సంస్థ అభివృద్ధిని అధికారులకు అడిగి తెలుసుకున్నారు.