2022లో బేగంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన మైనర్ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన బత్తుల వినోద్ కుమార్ (38)కు జైలు శిక్ష పడింది. బాలంరాయికి చేసిన వినోద్ అదే ప్రాంతానికి చెందిన బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. కేసు కోర్టులో ట్రయల్ నడుస్తుంది. గురువారం నాంపల్లి కోర్ట్లో నిందితుడికి నాయమూర్తి 3 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, రూ.5వేల జరిమానా విధించారని బేగంపేట సీఐ సైదులు పేర్కొన్నారు.