నారాయణ్‌ఖేడ్: భీమ్రాలో బాలుడు పోలియో చుక్కల మందు వల్ల మరణించలేదు: కంగ్టి లో డాక్టర్ నాగరాణి
భీమ్రా గ్రామంలో మూడేళ్ల బాలుడు పోలియో చుక్కల మందు వల్ల మరణించలేదని కంగ్టి పిహెచ్సి డాక్టర్ నాగ రాణి తెలిపారు. ఆదివారం ఆమె మాట్లాడుతూ భీమ్రా గ్రామంలో 103 మందికి పోలియో చుక్కలు వేయడం జరిగింది అని తెలిపారు. బాలుడు మరణానికి గల కారణాలు పోస్టుమార్టం రిపోర్టులో తెలుస్తాయని తెలిపారు.