మదనపల్లి నియోజకవర్గంలోని రామసముద్రం మండలంలో గురువారం రాత్రి 70 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డ ఎస్సై వెంకటసుబ్బయ్య. మదనపల్లి రూరల్ సీఐ రమేష్ ను విచారణ అనంతరం శుక్రవారం రాత్రి సుమారు 10 గంటల ప్రాంతంలో ఏసీబీ అధికారులు ఇద్దరిని రిమాండ్ కు తరలిస్తున్నట్లు ఏ సి బి ఏ ఎస్ పి విమలకుమారి తెలిపారు. ఇదే కేసుకు సంబంధించి మదనపల్లి డిఎస్పి దర్బార్ కొండయ్య నాయుడు ను సైతం విచారించినట్లు ఆమె తెలిపారు.