ఒంగోలు అర్బన్: కొత్తపట్నం మండలం పల్లె పల్లెలో పర్యటించిన కలెక్టర్ రాజాబాబు, పలు అంశాలపై సమీక్ష
Ongole Urban, Prakasam | May 2, 2026
ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలంలోని పల్లె గ్రామంలో శనివారం కలెక్టర్ రాజాబాబు పర్యటించారు. పల్లెనిద్ర కార్యక్రమంలో భాగంగా శుక్రవారం రాత్రి గ్రామంలోని నిద్రించి శనివారం ఉదయం పలు కార్యక్రమాలలో కలెక్టర్ రాజాబాబు పాల్గొన్నారు. ఉపాధి హామీ పనులు, పారిశుద్ధ్య పనులు, పొలం పిలుస్తుంది కార్యక్రమం, వివిధ అంశాలపై ప్రజలతో కలెక్టర్ మాట్లాడారు. రానున్న రోజుల్లో ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని పారిశుద్ధ్య నిర్వహించాలని కలెక్టర్ అధికారులకు తెలిపారు.