ధన్వాడ: నారాయణపేట జిల్లా కేంద్రంలోని ప్రోటోకాల్ పాటించలేదని కాంగ్రెస్ నేతల నిరసన
నారాయణపేట జిల్లా కేంద్రంలోని గురుకుల పాఠశాలలో ఏర్పాటు చేసిన బోధనాబ్యాస సామగ్రి జిల్లా స్థాయి మేళా కార్యక్రమానికి ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డికి ఆహ్వానం అందించలేదని పాఠశాలలో కాంగ్రెస్ పార్టీ నేతలు నిరసన వ్యక్తం చేశారు. మేళాకు సంబంధించిన ఫ్లెక్సీని చించి వేశారు. ప్రోటోకాల్ ఎందుకు పాటించలేదని విద్యా శాఖ అధికారులతో వాగ్వాదానికి దిగారు. ఎమ్మెల్యేకు సమాచారం ఇవ్వకుండా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని పాఠశాల ముందు బైటాయించి DEO కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. డిఇఓ గోవిందరాజు పాఠశాల వద్దకు చేరుకొని క్షేమాపణ చెప్పారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని