ఒంగోలులో రోడ్డు ప్రమాదం జరిగి లారీలో బయటపడ్డ గంజాయి, దర్యాప్తు చేస్తున్నామని తెలిపిన డిఎస్పి శ్రీనివాసరావు
Ongole Urban, Prakasam | Jun 3, 2026
ఒంగోలు లో బుధవారం తెల్లవారుజామున నాటిక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఆగి ఉన్న లారీని ఓ ద్విచక్ర వాహనదారుడు ఢీకొట్టాడు. అయితే సంఘటనా స్థలానికి చేరుకొని లారీని పరిశీలించిన పోలీసులు అవాక్కయ్యారు. వైజాగ్ నుంచి చెన్నై వరకు వెళ్తున్న లారీలో ఐదు క్వింటాల గంజాయి ఉండడానికి గుర్తించారు. తౌడు బస్తాల మధ్య గంజాయిని తరలిస్తుండగా పోలీసులు గుర్తించి దర్యాప్తు చేపట్టారు. లారీ డ్రైవర్ లారీని అక్కడే వదిలి పరారవడం సంచలనంగా మారింది. డీఎస్పీ శ్రీనివాసరావు దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.