అనంతపురం జిల్లా కూడేరు మండల కేంద్రంలో శనివారం స్వర్ణ ఆంధ్ర - స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్, తదితరులు వివిధశాఖలో అధికారులతో కలిసి పాల్గొన్నారు.ముందుగా కడదరకుంట రోడ్డులోని భగవతి ఫంక్షన్ హాల్ నుంచి మెయిన్ రోడ్డు వరకు నిర్వహించే సైకిల్ ర్యాలీ (500 మీటర్లు)ని ఎంపీ, జిల్లా కలెక్టర్లు ప్రారంభించారు. అనంతరం సచివాలయం వద్ద స్టేట్ స్వచ్ఛంద్ర కార్పొరేషన్ డైరెక్టర్ పి.భవాని రవికుమార్, సర్పంచ్ లలితమ్మ తదితరులతో కలిసి మొక్కలను నాటారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ...