బాల్కొండ: ఎంపీ అరవింద్ మోడీ దగ్గరికి వెళ్లి యూరియా తీసుకురావాలి: వేల్పూర్ లో ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి సవాల్
నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గ శాసనసభ్యులు, మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి వేల్పూర్ లోని తన నివాసంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, రైతులకు యూరియా, వస్తా ఇప్పించలేని ఎంపీలు ఎందుకున్నారని ప్రశ్నించారు. కేసీఆర్ ముందుచూపుతో పదేళ్లుగా యూరియా కొరత రాలేదని, అరవింద్ కు దమ్ముంటే మోడీ దగ్గరికి వెళ్లి యూరియా తీసుకురావాలని సవాల్ విసిరారు. రైతులకు యూరియా, వస్తా ఇవ్వలేని అసమర్థ ఎంపీలు రాజీనామా చేయాలని, పదవుల్లో ఉండటానిక అర్హత లేదని ఆయన హెచ్చరించారు.