ఉరవకొండ: గడేకల్ గ్రామంలో వరుసగా ఐదు రోజులపాటు వైద్య శిబిరం ఏర్పాటు
అనంతపురం జిల్లా విడపనకల్లు మండలం గడేకల్ గ్రామంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారుల ఆదేశాల మేరకు ఐదు రోజులపాటు వరుసగా వైద్య శిబిరం ఏర్పాటు చేసి చికిత్సలు అందించడం జరుగుతుందని ఉరవకొండ డివిజన్ మలేరియా సబ్ యూనిట్ అధికారి బత్తుల కోదండరామిరెడ్డి మంగళవారం సాయంత్రం పేర్కొన్నారు. ప్రతిరోజు గ్రామంలో వైద్య శిబిరంను వైద్యాధికారుల పర్యవేక్షణలో నిర్వహించి గ్రామంలో ఇంటింటా వెళ్లి ఫీవర్ సర్వే, రక్త నమూనాల సేకరణ, సీజనల్ వ్యాధులపై ప్రజలకు అవగాహన, డ్రైడే,దోమల నివారణకు క్రిమిసంహారక మందుల పిచికారి కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు.