పలమనేరు: నిండా మునిగిన రైతులను ఆదుకోవాలని బాదిత రైతులు మరియు జిల్లా రైతు నాయకుడు ఉమాపతి డిమాండ్ #localissue
పలమనేరు: రూరల్ మండలం బయ్యప్పగారి పల్లి పంచాయతీ కాలవపల్లి గ్రామ సమీపంలో కౌండిన్యా నదిలో త్రాగునీటి కోసం గతంలో రిజర్వాయర్ నిర్మించారు. ఈ నదికి ఆనుకుని ఉన్న కొంతమంది వ్యవసాయ భూములు పూర్తిగా నిటముగి నష్టపోతున్న సందర్భంలో అప్పటి ప్రభుత్వం కొంతమందికి మాత్రమే నష్టపరిహారం ఇచ్చారని మిగిలిన కొంత మంది గ్రామానికి చెందిన మడవలి మునిరత్నం.చిన్న రాజులు. లోకనాధం.ఉమాపతి తదితర రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి నష్టపరిహారం లేకపోయినా భూములను మట్టితోలి ఎత్తు పెంచి ఇవ్వాలని డిమాండ్ చేశారు.