బనగానపల్లె: బనగానపల్లె మండలం లో టిడిపి సీనియర్ నాయకుడు మృతి,నివాళులర్పించిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి
నంద్యాల జిల్లా బనగానపల్లె మండలం సాధుకొట్టం గ్రామానికి చెందిన టీడీపీ సీనియర్ నాయకుడు సంగు శ్రీనివాస రెడ్డి అనారోగ్యంతో చికిత్స పొందుతూ మృతిచెందారు. విషయం తెలుసుకున్న రాష్ట్ర మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి వారి నివాసానికి వెళ్లి మృతదేహానికి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.