మైనింగ్ కార్యకలాపాలతో పాటు వచ్చే వ్యర్ధాల నిర్వహణపైన యజమానులు దృష్టి సారించడం తో పాటు మైనింగ్ కార్మికుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రాజాబాబు పేర్కొన్నారు. బుధవారం చీమకుర్తి లోని గ్రానైట్ క్వారీని జిల్లా కలెక్టర్ రాజాబాబు, శాసన సభ్యులు విజయకుమార్ తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మైనింగ్ అధికారులు క్వారీలో గ్రానైట్ రాళ్ళ వెలికి తీసే విధానం ను వివరించారు. అనంతరం జిల్లా కలెక్టర్ క్రిష్ణ సాయి గ్రానైట్ కంపెనీని సందర్శించి గ్రానైట్ కటింగ్ మరియు పాలిష్ విధానాన్ని పరిశీలించారు.