ముమ్మిడివరం నియోజకవర్గ అసెంబ్లీ స్థానానికి నలుగురు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు.
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గ అసెంబ్లీ స్థానానికి నలుగురు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ తరఫున పెమ్మాడి స్వామి, స్వతంత్ర అభ్యర్థులుగా దొంగ సత్య రామ్, అంగాడి రేవతి మరియు జై భారత్ నేషనల్ పార్టీ అభ్యర్థిగా వనచర్ల బాబ్జి నామినేషన్లు వేశారు. రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు అందజేశారు.