మాజీ ఎమ్మెల్యేప్రకాష్ రెడ్డి కార్యకర్తలను మోసం చేస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నాడు :మాజీసింగలవిండో అధ్యక్షుడు శివారెడ్డి
Anantapur Urban, Anantapur | Apr 4, 2026
రాప్తాడు నియోజకవర్గం లో మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి కార్యకర్తలను మోసం చేస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నాడని వైసిపి బహిష్కృత నేత మాజీ సింగిల్ విండో అధ్యక్షుడు శివారెడ్డి ఆరోపించారు. శనివారం మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో ప్రెస్ క్లబ్ లో వైసీపీ బహిష్కృత నాయకులతో కలిసి ఆయన సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గత ఐదేళ్లలో ఒక్క కార్యకర్తకు న్యాయం చేయలేదన్నారు.ఎంపీటీసీ జడ్పిటిసి ఎన్నికల్లో కార్యకర్తల నుంచి పెద్ద ఎత్తున డబ్బులు వస్తువులు చేశారని ఆరోపించారు.