గూడెం కొత్తవీధి మండల కేంద్రం నుంచి నూతులుకి సొంతంగా మట్టిరోడ్డు నిర్మాణం చేపట్టుకున్న గిరిజనులు
గూడెంకొత్తవీధి పంచాయతీ పరిధి నూతులు గ్రామానికి గిరిజనులు సొంతంగా మట్టిరోడ్డు నిర్మాణం చేసుకుంటున్నారు. కురుస్తున్న భారీవర్షాలకు గూడెంకొత్తవీధి జంక్షన్ నుంచి నూతులు వరకు ఉన్న మట్టిరోడ్డు పలుచోట్ల కోతకు గురై కొట్టుకుపోయింది. ఈ రహదారికి నిర్మాణం చేపట్టాలని అధికారులకు ఎన్నోసార్లు విన్నవించిన పట్టించుకోలేదని వారు తెలిపారు. దీంతో శనివారం నుంచి గిరిజనులంతా కలసి సొంతంగా మట్టిరోడ్డు నిర్మాణం చేపట్టారు.