అనంతపురం అర్బన్: అనంతపురం నగరంలోని శారదా నగర్ లో డిగ్రీ కళాశాలలో రికార్డు అసిస్టెంట్ గా పని చేస్తున్న ఉద్యోగి అనుమానాస్పద మృతి
Anantapur Urban, Anantapur | Apr 10, 2026
అనంతపురం నగరంలోని శారద నగర్ లో అనంతపురం కె ఎస్ ఎన్ మహిళా డిగ్రీ కళాశాలలో రికార్డు అసిస్టెంట్ గా పనిచేస్తున్న ఆదిశేషయ్య అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. దీంతో మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలోని మార్చురీకి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.