వికారాబాద్: పదవ తరగతి ఇంటర్ పరీక్షలు సజావుగా పకడ్బందీగా నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి
మార్చి 18 నుండి ఏప్రిల్ రెండు వరకు నిర్వహించే పదవ తరగతి పరీక్షలు, ఫిబ్రవరి 28 నుండి మార్చి 19 వరకు ఇంటర్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి తెలిపారు. కలెక్టర్ కార్యాలయంలో గురువారం జిల్లా అధికారులతో పదవ తరగతి ఇంటర్ పరీక్షల గురించి సమావేశం నిర్వహించారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలని తెలిపారు.