ఏటూరునాగారం: రామప్ప ఆలయానికి ముప్పు: ఓపెన్ కాస్ట్ గనిపై మంత్రి సీతక్క స్పష్టత
వెంకటాపూర్ శివారులో ఓపెన్ కాస్ట్ బొగ్గు గని ఏర్పాటుపై మంత్రి సీతక్క స్పందించారు. రామప్ప ఆలయానికి ఎటువంటి ముప్పు వాటిల్లదని, గనికి ఎటువంటి అనుమతులు ఇవ్వలేదని ఆమె స్పష్టం చేశారు. ఈ మేరకు రామప్ప పరిరక్షణ కమిటీకి మంత్రి హామీ ఇచ్చారు.