ఒంగోలు: ఏక సభ్య కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజాన్ మిశ్రా కు ఘనస్వాగతం పలికిన జిల్లా కలెక్టర్ తమీం అన్సరియా
ఒంగోలు.ఎస్సి కులాల ఉప వర్గీకరణకు సంబంధించి విజ్ఞప్తులను స్వీకరించేందుకు రెండు రోజుల పర్యటనలో భాగంగా ఆదివారం మధ్యాన్నం మూడు గంటల సమయంలో ఒంగోలు కు విచ్చేసిన కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా ని స్థానిక ఎన్ ఎస్ పి అతిథి గృహంలో జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా, జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాల క్రిష్ణ మర్యాద పూర్వకంగా కలసి పుష్ప గుచ్చాలు అందచేసారు.అంతకముందు రాజీవ్ రంజన్ మిశ్రా గారికి జిల్లా రెవెన్యూ అధికారి చిన ఓబులేసు, ఒంగోలు డిడి లక్ష్మా నాయక్, ఎస్సి కార్పొరేషన్ ఈడి అర్జున్ నాయక్ కు ఘన స్వాగతం పలికి పుష్ప గుచ్ఛాలు అందచేసారు.