నిజామాబాద్ సౌత్: సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో బతుకమ్మ వేడుకలు, పాల్గొన్న ఎమ్మెల్యేలు, కలెక్టర్, అధికారులు
సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో బతుకమ్మ సంబురాలు అంబరాన్ని అంటాయి. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో జిల్లా స్థాయిలో నిర్వహించిన ఈ వేడుకకు అట్టహాసపు ఏర్పాట్లు చేశారు. శాసన సభ్యులు డాక్టర్ ఆర్. భూపతి రెడ్డి, దన్పాల్ సూర్యనారాయణ, కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి, పోలీస్ కమిషనర్ సాయి చైతన్య, అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్ పాల్గొన్నారు. ఈ వేడుకలతో కలెక్టరేట్ ప్రాంగణం సరికొత్త శోభతో ఉట్టిపడింది. రంగు రంగుల పూలతో అందంగా అలంకరించిన బతుకమ్మలను ఒక చోటకు చేర్చి, గౌరీ మాతను స్తుతిస్తూ మహిళలు బతుకమ్మ పండుగను సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు.