ఇల్లందకుంట: మండల కేంద్రంలో శ్రీ సీతారామచంద్రస్వామి గ్రామ దేవాలయంలో శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ప్రత్యేక పూజలు స్వామివారి ఊరేగింపు
ఇల్లందకుంట: మండల కేంద్రంలోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో మంగళవారం ఉదయం గ్రామ దేవాలయంలో శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా శ్రీ స్వామివారి ఊరేగింపు కార్యక్రమాన్ని ఆలయ అర్చకులు శేషం రామాచార్యులు ఆధ్వర్యంలో నిర్వహించారు. వాయిద్యాలతో స్వామివారిని పురవీధుల గుండా ఊరేగింపు నిర్వహించారు. అనంతరం వేద పండితులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ ఇంగిలే రామారావు కమిటీ సభ్యులు అర్చకులతో పాటు భక్తులు పాల్గొన్నారు.