రాజేంద్రనగర్: ఫరూక్ నగర్ మండలంలో విద్యుత్ షాక్ తో ఒక వ్యక్తి మృతి
ఫరూఖ్‌నగర్ మండలం భీమారం గ్రామంలో యాదయ్య అనే వ్యక్తి కరెంట్ షాక్‌తో మృతిచెందాడు. గ్రామస్థులు తెలిపిన వివరాలు.. ట్రాన్స్ ఫార్మర్ వద్ద యాదయ్యకు ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలు తగలడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. యాదయ్య కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు. కాగా ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది