అనంతపురం అర్బన్: అనంతపురం నగర శివారులోని మనీలా సమీపంలో ద్విచక్ర వాహనం అదుపుతప్పి బోల్తా పడి ఆర్ఎంపి వైద్యుడు మృతి
Anantapur Urban, Anantapur | May 7, 2026
అనంతపురం నగర శివారులోని రూరల్ మండల పరిధిలో ఉన్న మనీలా గ్రామం సమీపంలో ద్విచక్ర వాహనం అదుపుతప్పి బోల్తా పడిన ఘటనలో రామకృష్ణ అనే ఆర్ఎంపి వైద్యుడు మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. దీంతో మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలోని మార్చురీకి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.