సంగారెడ్డి: గొల్ల కురుమలకు సుడా చైర్మన్ పదవి : టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి
గొల్ల కురుమలకు సుడా ఛైర్మన్ పదవి ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరినట్లు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. సంగారెడ్డిలోని ప్రభుత్వ అతిథిగృహం వద్ద బుధవారం రాత్రి గురువారం వరకు జరిగిన సదర్ సమ్మేళనంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఆంజనేయులకు సుడా ఛైర్మన్ పదవి ఇచ్చేందుకు సీఎంతో పాటు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రి దామోదర్ దృష్టికి తీసుకెళ్లినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు.