సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమం ద్వారా జీఎస్టీ తగ్గింపు వల్ల చేకూరే లబ్ధిపై ప్రజలలో అవగాహన పెంచాలి
సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్స్ కార్యక్రమం ద్వారా జీఎస్టీ తగ్గింపు వల్ల చేకూరి లబ్ధిపై ప్రజల్లో అవగాహన పెంచాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం అమరావతి లోని సచివాలయం నుండి రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి విజయానంద్... సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్, ప్రజల నుండి అభిప్రాయాల సేకరణ, ప్రధానమంత్రి కుసుం పథకంలో భాగంగా భూసేకరణ, రాబోయే రోజుల్లో రాష్ట్రంలో వర్షపాతం, తదితర అంశాలపై అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.