నంద్యాల అర్బన్: శ్రీశైలం వెళ్లే భక్తులకు తీవ్ర ఇబ్బందులు, నంద్యాలలో శ్రీశైలం వెళ్లే ఆర్టీసీ బస్సుల కొరత
Nandyal Urban, Nandyal | May 17, 2026
నంద్యాల నుండి ఆత్మకూరు మీదుగా శ్రీశైలం వెళ్లే భక్తులకు ఇబ్బందులు తప్పడం లేదు. వేసవి సెలవులు కావడంతో శ్రీశైలం వెళ్లే ప్రయాణికులు బస్సు సర్వీసులు తక్కువగా ఉండడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఆదివారం నంద్యాల బస్టాండ్ తో పాటు పట్టణంలోని ఆత్మకూరు బస్టాండ్ లో కూడా శ్రీశైలం వెళ్లే భక్తులు బస్సుల కోసం వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. బస్సు శ్రీశైలం కి బస్సు సర్వీసులు పెంచాలని ప్రయాణికులు ఆర్టీసీ అధికారులను కోరుతున్నారు