కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని అంజుమన్ మజీద్ కాంపౌండ్లో సాయంత్రం 4:30 గంటల సమయంలో AC బ్లాస్ట్ అయ్యింది. ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. ఈ ప్రమాదంలో చిన్నారి ఘటనా స్థలంలోనే మృతి చెందగా, మరో బాబుకు గాయాలు అయ్యాయి. బాధితుడిని చికిత్స కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. మృతి చెందిన చిన్నారి వయస్సు సుమారు రెండు సంవత్సరాలు, గాయపడిన చిన్నారి వయస్సు మూడు సంవత్సరాలుగా పోలీసులు తెలిపారు.