కూటమి పాలన ప్రజలతో మోసం చేసింది:వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి
లక్కిరెడ్డిపల్లె మండలం పందిళ్లపల్లెలో ఆదివారం మధ్యాహ్నం వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి కార్యకర్తలు, నాయకులతో కలిసి “రచ్చబండ – కోటి సంతకాల సేకరణ” కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కూటమి పాలనలో ప్రజల సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు పూర్తిగా నిలిచిపోయాయని విమర్శించారు. ఎన్నికల హామీలను నెరవేర్చడంలో ప్రభుత్వం విఫలమైందని, ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొన్నదని తెలిపారు. కూటమి వైఫల్యాలను ప్రజలు గమనిస్తున్నారని, రాబోయే రోజుల్లో ప్రజల తీర్పు తేల్చి చూపుతుందని శ్రీకాంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.