సైదాబాద్: కృష్ణానగర్ లో భారీ గా వరదనీటి ప్రవాహం.. స్కూటీ తో సహా కొట్టుకు పోయిన వ్యక్తి
నగరం లో కురిసిన భారీ వర్షాలకు దిగువ ప్రాంతాలకు వరదనీరు పోటెత్తింది. ఈ వరదలో రోడ్డుపై స్కూటీ పై వెళ్తున్న వ్యక్తి కింద పడిపోయి వరదల్లో కొట్టుకు పోయాడు. స్థానికులు ఆపేందుకు ప్రయత్నించినా వరదప్రవాహం ఎక్కువగా ఉండటంతో నిలువరించలేక పోయారు.. దీంతో కొద్దిదూరం నీటిలోనే కొట్టుకుపాయాడు బాధితుడు