సూర్యాపేట: తుంగతుర్తిలో ప్రధాన రహదారి కిటకిట
విజయదశమి పండుగ సందర్భంగా తుంగతుర్తి మండల కేంద్రంలోని ప్రధాన రహదారి గురువారం ప్రజలతో, వాహనాలతో రద్దీగా మారింది. వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు పూలు, కూరగాయలు కొనుగోలు చేసేందుకు తరలివచ్చారు. గాంధీ జయంతి కావడంతో మాంసం దుకాణాలు మూసివేశారు. దీంతో మాంసం కొనేందుకు వచ్చిన ప్రజలు నిరాశతో వెనుతిరిగి వెళ్లారు. అయినప్పటికీ మార్కెట్లో ప్రజల సందడితో తుంగతుర్తి ప్రాంతం మొత్తం పండుగ వాతావరణాన్ని సంతరించుకుంది.