రాజేంద్రనగర్: శేర్లింగంపల్లి నియోజకవర్గంలో రూ. 49 లక్షలతో బర్నింగ్ ప్లాట్ఫారం నిర్మాణ పనులు
రూ.49 లక్షలతో బర్నింగ్ ప్లాట్ ఫారం నిర్మాణ పనులు ఆల్విన్ కాలనీ డివిజన్ ఎల్లమ్మబండ హిందూ శ్మశాన వాటిక సుందరీకరణ పనులను పకడ్బందీగా పూర్తి చేయిస్తామని స్థానిక కార్పొరేటర్ దొడ్ల వెంకటేశ్ గౌడ్ అన్నారు. ఇవాళ శ్మశాన వాటిక అభివృద్ధిలో భాగంగా రూ.49 లక్షల వ్యయంతో చేపడుతున్న బర్నింగ్ ప్లాట్ ఫామ్ స్లాబ్ నిర్మాణ పనులను జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి పరిశీలించారు.