ఒంగోలు అర్బన్: "ప్రజా సమస్యల పరిష్కార వేదిక" లో అందిన అర్జీలను నిర్దిష్టమైన గడువులోపు పరిష్కరించేలా ప్రత్యేక శ్రద్ద చూపాలి: జేసీ
Ongole Urban, Prakasam | Apr 13, 2026
"ప్రజా సమస్యల పరిష్కార వేదిక" లో అందిన అర్జీలను నిర్దిష్టమైన గడువులోపు పరిష్కరించేలా ప్రత్యేక శ్రద్ద చూపాలని జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి, అన్ని శాఖల అధికారులను ఆదేశించారు. ఒంగోలు కలెక్టరేట్ లోని పిజిఆర్ఎస్ హాల్లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రీడ్రసెల్ సిస్టం, పిజిఆర్ఎస్), కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి, జిల్లా రెవెన్యూ అధికారి చిన ఓబులేసు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు శ్రీధర్ రెడ్డి, ఎ మహేష్, డిపిఓ వెంకటేశ్వర రావులతో కలసి పాల్గొని ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు.