ఒంగోలు అర్బన్: ప్రభుత్వ హాస్టళ్లలో ఉంటున్న విద్యార్థుల సంక్షేమం, విద్య, ఆరోగ్యం పట్ల ఎంత మాత్రమూ నిర్లక్ష్యం వద్దు : జిల్లా కలెక్టర్
Ongole Urban, Prakasam | Jul 8, 2026
ప్రభుత్వ హాస్టళ్లలో ఉంటున్న విద్యార్థుల సంక్షేమం, విద్య, ఆరోగ్యం పట్ల ఎంత మాత్రమూ నిర్లక్ష్యం ఉండకూడదని జిల్లా కలెక్టర్ రాజాబాబు స్పష్టం చేశారు. కేవలం విద్యార్థులుగా కాకుండా తమ సొంత బిడ్డలుగా భావించి వారి సర్వతోముఖాభివృద్ధికి అధికారులు దృష్టి సారించాలని ఆయన దిశా నిర్దేశం చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగ, సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ విద్యా సంస్థలలో పనిచేస్తున్న అధికారులు, సిబ్బందితో బుధవారం ప్రకాశం భవనంలో ఆయన ప్రత్యేక సమావేశం నిర్వహించారు. శాఖాపరంగా తీసుకుంటున్న చర్యలను, గత విద్యా సంవత్సరం పదవ తరగతి పరీక్షలలో సాధించిన ప్రగతిని మెరుగుపరుచుకోవాలన్నారు