ఆళ్లగడ్డ: ఆళ్లగడ్డ పట్టడంలోని ఐసిడిఎస్ కార్యాలయంలో మిషన్
వాత్సల్య పై అవగాహన సదస్సు
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ పట్టణంలోని ఐసిడిఎస్ కార్యాలయంలో మిషన్ వాత్సల్య స్పాన్సర్ షిప్ పథకం లబ్ధిదారులతో గురువారం ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించారు, తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న తల్లిదండ్రుల పిల్లలు, దివ్యాంగ పిల్లలు ఈ పథకానికి అర్హులని జిల్లా బాలల సంరక్షణ విభాగం సంరక్షణ అధికారి దర్గయ్య వివరించారు, ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకొని విద్య ద్వారా ఉన్నత లక్ష్యాలను సాధించాలని సూచించారు