అనంతపురం అర్బన్: కర్ణాటక రాష్ట్రంలోని గుడిపల్లి లో ఉరేసుకుని ఆత్మహత్యయత్నానికి పాల్పడిన వ్యక్తి నగరంలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి
Anantapur Urban, Anantapur | Apr 8, 2026
కర్ణాటక రాష్ట్రంలోని తలుకు పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న గుడిపల్లి సమీపంలో వ్యవసాయ పొలంలో ఉరేసుకుని ఆత్మహత్య యత్నానికి పాల్పడిన అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం లోని శేట్టూరు మండలం తిప్పనపల్లి కి చెందిన కృష్ణమూర్తి నగరంలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మధ్యాహ్నం మృతి చెందాడు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలోని మార్చురీకి తరలించారు.