ఉరవకొండ: మెడికల్ కళాశాలలో ప్రైవేటీకరణ పై ఈనెల 28న నియోజకవర్గం కేంద్రాల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ర్యాలీ
మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ పై ప్రభుత్వ నిర్లక్ష్యఫు ధోరణిని నిరసిస్తూ ఈనెల 28న నియోజకవర్గ కేంద్రంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ర్యాలీ నిర్వహిస్తున్నట్టు ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే నియోజకవర్గం వైఎస్ఆర్సిపి సమన్వయకర్త వై విశ్వేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. అనంతపురం జిల్లా బెలుగుప్ప మండలం వైఎస్ఆర్సిపి నాయకులతో బుధవారం సాయంత్రం కళ్యాణదుర్గం శ్రీ పద్మావతి కళ్యాణమండపంలో మాజీ ఎమ్మెల్యే సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. గ్రామాల్లో కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఈనెల 28న నియోజకవర్గం కేంద్రంలో ర్యాలీని విజయవంతం చేయాలన్నారు.