రాప్తాడు: నారా లోకేష్ పాదయాత్రలో ఇచ్చిన ప్రతి హామీని విద్యార్థినిలకు నెరవేర్చాలి ఎస్కే యూనివర్సిటీలో ఏఐఎస్ఎఫ్ కార్యదర్శి రమణయ్య
అనంతపురం జిల్లా అనంతపురం రూరల్ లోని శ్రీకృష్ణదేవరాల విశ్వవిద్యాలయంలో నాలుగు గంటల 20 నిమిషాల సమయంలో ఎస్కే యూనివర్సిటీ ఏఐఎస్ఎఫ్ యూనివర్సిటీ కార్యదర్శి రమణయ్యఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి కొల్లాయిప్పఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు వల్లరాజు తదితరుతో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ యూనివర్సిటీ కార్యదర్శి రమణయ్య మాట్లాడుతూ పాదయాత్ర చేస్తున్న సందర్భంలో నారా లోకేష్ విద్యార్థినిలకు జీవో నెంబర్ 77ను రద్దు చేస్తానని హామీ ఇవ్వడం జరిగిందని వెంటనే హామీని నిలబెట్టుకోవాలని ఏఐఎస్ఎఫ్ ఎస్.కె యూనివర్సిటీ కార్యదర్శి రమణయ్య డిమాండ్ చేశారు.