కుంటిమిదిలో ఇళ్ల స్థలాలు కేటాయించేందుకు స్థలాలను పరిశీలించిన హిందూపురం టిడిపి పార్లమెంట్ బీసీ సెల్ అధ్యక్షుడు రంగయ్య
సత్యసాయి జిల్లా రామగిరి మండలం కుంటిమద్ది పంచాయతీలో గురువారం నాలుగు గంటల సమయంలో రామగిరి ఎమ్మార్వో ఆర్ఐ అధికారులతో కలిసి టీడీపీ హిందూపురం పార్లమెంట్ బీసీ సెల్ అధ్యక్షుడు రంగయ్య కుంటిమధ్యలో పలు స్థలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా టిడిపి హిందూపురం పార్లమెంట్ బీసీ సెల్ అధ్యక్షుడు రంగయ్య మాట్లాడుతూ ఎమ్మెల్యే పరిటాల సునీత ఆదేశాల మేరకు కుంటిమిది పంచాయతీలు నిరుపేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించేందుకు అనువైన స్థలాలను పరిశీలించడం జరిగిందని రానున్న రోజుల్లో పేద ప్రజలకు అనువైన ప్రాంతంలో ఇళ్ల స్థలాలు కేటాయిస్తామని అందుకు స్థలాలు పరిశీలిస్తున్నామని టిడిపి బీసీ సెల్ అధ్యక్షుడు రంగయ్య తెలిపారు.